కరోనా వైరస్ చాప కింద నీరులా తెలుగు రాష్ట్రాలకు చేరుకుంది. తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ నెల 13 న ఇండోనేషియా నుంచి ఢిల్లీకు 11 మంది రాగా వారంతా అక్కడ నుంచి మార్చి 14 న సంపర్క్ కాంతి ట్రైన్ లో ఉన్న ఎస్ 9 బోగీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం చేరుకున్నారు. అయితే, రామగుండం వచ్చిన తరువాత సదరు వ్యక్తికి దగ్గు, జలుబు పట్టుకున్నాయి.
అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అలెర్ట్ అయిన అధికారులు సదరు వ్యక్తితో ప్రయాణించిన వారిని టెస్ట్ చేశారు. అందులో 7 మందికి కరోనా పాజిటివ్ రావటంతో హై అలెర్ట్ ప్రకటిచారు. మార్చి 15 వ తేదీన ఎస్ 9 బోగీలో ప్రయాణం చేసిన వ్యక్తుల వివరాలు కావాలని రైల్వే శాఖకు మార్చి 17 న వైద్యశాఖ లేఖ రాసింది.. త్వరలోనే వీరిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఎస్ 9 బోగీలో ప్రయాణం చేసిన వారంతా కూడా ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయుంచుకోవాలని ఆదేశాలు జారీచేశారు అధికారులు. కరీంనగర్ లో 100 ప్రత్యేక బృందాలను పెట్టి ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేందుకు ఎర్పాట్లు చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఏడుగురు ప్రయాణించిన ఎస్ 9 బోగీలో మొత్తం 82 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఆ బోగీలో ప్రయాణించిన 82 మంది ఎక్కడెక్కడ దిగారు, కరీంనగర్ లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్క తిరిగారు అనేది పరిశీలిస్తున్నారు.ఆ బోగి లో ప్రయాణించిన వారు ఎక్కడెక్కడ దిగారు అనేది కూడా ప్రభుత్వం, రైల్వే శాఖ సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నారు.