నల్గొండ జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేగింది. జైల్ ఖానా సమీపంలోని ప్రార్ధన మందిరంలో వియత్న బృందం పర్యటించింది. అర్ధరాత్రి 12 మంది పెద్దలు,ఇద్దరు చిన్నారులను సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తులందరూ కూడా 4వ తేదీన ఢిల్లీ లో ఎయిర్పోర్ట్ లో దిగారు. అక్కడి నుంచి 9వ తేదీన నాంపల్లి స్టేషన్ కు చేరుకొని ఇద్దరు గైడ్లతో కలిపి నల్గొండ కు 9వ తేదీన వచ్చారు. వాళ్ళు నల్గొండ వచ్చి 14 రోజులయ్యింది.
గురువారం ఉదయం పోలీసులకుకి సమాచారం తెలిసి సాయంత్రం అందరిని ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఎవరికి కరోనా లక్షణాలు లేవు. ముందు జాగ్రత్త కోసం వీళ్లను గాంధీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.