తన కూతురుకు కరోనా వస్తుందనే భయంతో పదవతరగతి పరీక్షకు పంపలేదు ఓ తండ్రి. విద్యార్థిని పరీక్షకు రాకుండా తండ్రి అడ్డుకున్నడని తెలిసి అధ్యాపకులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనితో DEO ఆదేశాలతో అమ్మాయి ఇంటికి వెళ్లి తల్లి దండ్రులకు అవగాహన కల్పించి పరీక్ష వ్రాయడానికి MEO జమున కుమారి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం తెల్లపూర్ లో పదవ తరగతి పరీక్ష కు కరోన ఎఫెక్ట్ వలన దుర్గ భవాని ని పరీక్షకు వ్రాయొద్దు అంటూ తల్లిదండ్రులు అడ్డుకున్నారు.
భవాని భవిష్యత్ ను నాశనాం చేస్తున్నారని అధ్యాపకులు జోక్యం చేసుకుని పోలీసులు , MEO లతో కలసి దుర్గ భవాని తో పాటు తల్లి దండ్రులను ఒప్పించి 1 గంట ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే గురువారం జరిగిన పరీక్షకు కూడా భవాని హాజరు కాలేదు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న అధికారులు. వాస్తవానికి ఇన్ఫినిటీ హోమ్స్ లో వాచ్ మ్యాన్ గా పని చేసే తండ్రి వెంకటేష్ కు గత కొద్ది కాలం గా టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. తన కూతురు కు కరోన వ్యాధి సోకుతుంది అని అపనమ్మకంతో పరిక్ష కు పంపలేదని తండ్రి తెలిపారు.