ఓ పక్క కరోనా రోగం వెంటాడుతుంటే.. మరో పక్క తెలంగాణలో ప్రజలు పండగలు ఉత్సవాల పేరుతో గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణాలు చేస్తున్నారు. బస్సులో రైళ్లలో పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని.. జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నప్పటికీ.. ప్రజలు గుమికూడుతూ వైరస్ కు ఆథ్యం పోస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
అయితే.. సిద్ధిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నేడు పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా దృష్ట్యా అంతర్గతంగా అగ్నిగుండాలు, పెద్దపట్నం నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర నలుమూలల నుంచి కొమురవెల్లి మల్లన్న దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో స్వామి వారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది.అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించకుంటే ఎవ్వరినీ ఆలయంలోకి అనుమతించడం లేదు నిర్వహణ కమిటి అధికారలు.
రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పాలక మండలి ఏర్పాటు చేసింది. భౌతిక దూరం పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆలయ ప్రాంగణంలో అధికారలు తగు జాగ్రత్తలను పాటిస్తూ చర్చలు చేపట్టారు.