కరోనా తన కసినంత ఇండియాపై వెళ్ళగక్కుతుండటంతో కరోనా కేసులు పెరుగుతుండటంతో..దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. కరోనా ప్రభావంతో అన్ని కార్యకలాపాలు పడకేశాయి. సినిమా షూటింగ్స్ కుడా నిలిచిపోయాయి. దీంతో సినిమా ఆర్టిస్టులు అంత దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. కరోనా ఎఫెక్ట్ జబర్దస్త్ పై కుడా పడింది. శుక్రవారం ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ లో జడ్జిగా వ్యవహరించే రోజా కనిపించలేదు. ఆమె ప్లేసులో శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే ఆమె కొన్ని రోజులుగా జబర్దస్త్ లో కనిపించకపోవడంతో ఏవేవో ఊహగానాలు వినిపిస్తున్నాయి . రాజకీయాలను, అలాగే జబర్దస్త్ తోపాటు మరికొన్ని ప్రోగ్రామ్స్ చేస్తోన్న రోజా అన్నింటిని బ్యాలెన్స్ చేసేందుకు ఇబ్బంది అవుతుందని అందుకే ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పే యోచనలో ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఎపిసోడ్ లో కుడా రోజా కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోన్నప్పటికీ ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకే రోజా శుక్రవారం ప్రసారమైన ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో కనిపించలేదట.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలెవ్వరు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు కోరుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు ప్రభుత్వాల, పోలిసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంట్లో నుంచి బయటకు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినీతారలు, ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని కోరుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికి పరిమితం కాకుండా తాను చేయాల్సిన షోలో పాల్గొంటే జనాలకు తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని భావించి జబర్దస్త్ జడ్జి రోజా ఇంటికే పరిమితమయ్యారట. ఓ వైపు ప్రజలను ఇంట్లో ఉండమని చెప్తూ..మరో వైపు తాను బయటకు వెళ్లి ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం సరికాదని భావించి ఇటీవలి ఎపిసోడ్ లకు రోజా హాజరు కాలేదని టాక్. అంతేకాని ఆమె జబర్దస్త్ నుంచి తపుకోలేదని అంటున్నారు.