కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ హౌజ్ ఫుల్ అయిపోయాయి.కరోనా అనుమానితులు తప్పితే, వేరే రోగులకు ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి.ఔట్ పేషెంట్ విభాగాలు పూర్తిగా కరోనా అనుమానితులకే పరిమితమయ్యాయి. క్యాన్సర్, హెచ్ఐవి, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి తప్పనిసరిగా రెగ్యులర్ చెకప్ లు అవసరం.ఇలాంటి రోగులకు చికిత్స ఆలస్యం చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది.
లాక్ డౌన్ జరిగినప్పుడు ఢిల్లీలోని ఓ హాస్పిటల్ వద్ద నోటి క్యాన్సర్ బాధపడుతున్న ఒక మహిళను ఉదాహరణగా తీసుకోవచ్చు.మార్చ్ 13 న ఆమెకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది.ఇప్పుడేమో అన్ని మూసివేయబడ్డాయి.డాక్టర్లు చేసేది లేక పెయిన్ కిల్లర్స్ తో సరిపెట్టారు. రక్త స్రావం అవుతున్న ఆ మహిళకు దాన్ని నివారించే మందులు ఇచ్చి పంపించేశారు.ఆపరేషన్ ను వాయిదా వేశారు. ఇలాంటి కేసులు ఎన్నో దేశంలో ఉన్నాయి.కీమో థెరపీ, ఇమ్యునో థెరపీ, డయాలసిస్ అన్నీ వాయిదా వేస్తున్నారు.దీన్ని వల్ల చాలా మంది రోగుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి.
డయాలసిస్ రోగులు వారి సాధారణ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం.ఒకవేళ డయాలసిస్ దాట వేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి.
కరోనా ప్రభావంతో బీపీ, షుగర్ పేషెంట్లు ఆసుపత్రుల్లో ఓపి సేవలు అందుబాటులో లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొచ్చు కానీ పేద రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గర్భిణీ స్త్రీలకు సరైన ట్రీట్మెంట్ అందక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే, కరోనా ప్రభావంతో తీవ్రంగా ఉంటే మిగతా జబ్బులతో బాధపడే రోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చు.మిగతా జబ్బులతో ఇబ్బంది పడేవారు తక్కువ రోగ నిరోధక శక్తి తో ఉండడం వల్ల బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి.
తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులు ఫుల్ అయిపోయాయి. గాంధీ లో కరోనా అనుమానితులు తప్ప వేరే రోగులకు చికిత్స లేదు.ఆపరేషన్ లు వాయిదా వేశారు.ఇక ప్రైవేట్ హాస్పిటల్స్ 70 సంవత్సరాలు దాటిన రోగులను పట్టించుకోవట్లేదు.ఈ మధ్యే హైదరాబాద్ మల్కాజ్ గిరి లో ఒక వృద్దుడు సరైన చికిత్స అందక ప్రాణాలు కూడా కోల్పోయాడు.ప్రభుత్వాలు కరోనా రోగులతో పాటు మిగతా జబ్బులతో బాధపడే వారికి ట్రీట్ మెంట్ అందేలా చర్యలు తీసుకోవాలి.