కరోనా ఎవరికైనా రావచ్చు… తెల్లవారు జాము నుంచి రాత్రి నిద్రపోయెూ వరకు ఇరవై నాల్గు గంటలు ప్రజాసేవలో ఉండే పోలీసన్నలు జరబద్రంగా ఉండాలి. కరోనా వ్యాధి వ్యాపించకుండా రోడ్లపై ఎవరిని తిరగనివకుండా పోలీసులు పగలు…రాత్రి వేళ్లలో కట్టడి చేస్తునప్పట్టికి, కొందరు మూర్ఖంగా చిన్న పిల్లల్ని తమ వెంబడి బైక్ లపై రోడ్లపై తిప్పుతున్నారు. ప్రజలందరు క్షేమంగా ఉండాలని పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
పోలీసులకు కూడ కుటుంబ సభ్యులుంటారు కాబట్టి మీరు కూడ విధులు నిర్వహించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ వ్యాధి ఉందో ఎవరికి తెలవకపోవడంతో ప్రతి ఒకరిని దగ్గర నుంచి కాకుండా కొంతదూరం నుంచి వారి వివరాలు తెలుసుకోవాలి. చెకింగ్ సమయంలో తుమ్మిన, దగ్గిన, విషజ్వరాలతో బాధపడే వారిని డాక్టర్లు తప్ప ఎవరు గుర్తించలేరు. కాబట్టి పోలీస్ బ్రదర్స్ ఆండ్ పోలీస్ సిస్టర్స్ మీ కోసం కుటుంబ సబ్యులు ఇంటివద్ద ఎదురు చూస్తున్నారు ..కరోనా వచ్చిన తరువాత ఎవరు ఏమి చెయ్యలేరు. నివారణ ఒకటే మార్గం. కరోనా ఎవరికైనా రావచ్చు… తస్మత్ జాగ్రత్త.