బుల్లితెరపై అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ ముఫ్ఫై రోజుల్లో ప్రేమించడం ఎలా..?అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కుడా పూర్తి చేసుకోవడంతో ఈ మూవీలోని నీలినీలి ఆకాశం అనే పాటను కుడా విడుదల చేశారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు సాధిస్తుందని భావించారు. ఇక, మార్చి 25 ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కాని అంతలోనే కరోనా మహమ్మారితో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
పరిస్థితులు సద్దుమణిగాక సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నప్పటికీ…ఆ సమయంలో ఈ చిత్రానికి పోటీగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది. దాంతో ప్రదీప్ సినిమాకు థియేటర్లు దొరకడం గగనమే… థియేటర్లు లభ్యమైన స్టార్ హీరోల పోటీని తట్టుకొని ప్రదీప్ సినిమా ఏస్థాయిలో వసూళ్ళను రాబడుతోందో చూడాలి. దాంతో ఇప్పట్లో ఈ చిత్రం విడుదల ఉండకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.