కరోనా దాపరించడంతో కల్లు, మద్యం ప్రియులకు ఇబ్బంది మొదలైపోయింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా కల్లు, మద్యం మానేసే సరికి చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎప్పటి నుండో అలవాటు ఉండి, ప్రతి రోజు మద్యం, కల్లు తప్పనిసరిగా తాగే అలవాటున్న వారి కుటంబ సభ్యులు సైతం తమ వారి ప్రాణాల కోసం రొడ్డేక్కుతున్నారు. కొందరైతే మద్యం కోసం ఇంట్లో వాళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నకథనాలు వస్తున్నాయి.
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే…ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు కల్లు తాగితేనే రోజువారి పనులు మెుదలవుతాయి. లాక్ డౌన్ కారణంగా చెట్టుకల్లు లేకపోగా… కృత్రిమ కల్లును తయారు చేయడం, మత్తు రావడం కోసం క్లోరో హైడ్రేట్ ను అధిక మెూతాదులో కలపడంతో పాటు, కల్లులో కలిపిన మత్తు సరిపోకపోతే చిన్నపాటి కాగితంలో సి.హెచ్. కట్టించి ఇస్తున్నారు. కరోనా బాధ లేనప్పుడు సీసా కల్లు పది నుంచి పదహేను రూపాయాల వరకు విక్రయించేవారు. కాని ఇప్పుడు సీసా కల్లు 50 రూపాయాల నుంచి వంద రూపాయాల వరకు విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలు మెుత్తం అధికారికంగా కాదండి… బ్లాక్ లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్తికల్లు విక్రయాలు 64 మండలాలలో యధేచ్చగా విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో కల్లు మాఫీయా వుండటంతో దొడ్లోనిపల్లి కల్లులో అదిక సి.హెచ్. కలపడంతో కల్లు ప్రియులు అదికంగా ఇష్టపడుతారు. హన్వాడ, మహబూబ్ నగర్ టౌన్ లలో అధిక విక్రయాలు జరుగుతున్నాయి. కొందరైతే ఇంట్లో తమ పెద్దల పోరు బరించలేక ఎంత ఖర్చు అయిన పర్వలేదంటు, రెండువారాలకు సరిపడ్డ కల్తికల్లును డ్రమ్ లలో తమకు కావాల్సినంత నింపుకొని ఎవరి కంట పడకుండ ఇండ్లులకు గుట్టుచప్పుడు కాకుండా తరలించుకుంటున్నారు. ఇండ్లలో వుండే ఇంటిపెద్దలు తమ పిల్లలకు తెలవకుండా రహస్యంగా తెప్పించుకొని తాగేవారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. లాక్ డౌన్ కారణంగా ఎవరితో తెప్పించుకోవాలో తెలియక, ఇంట్లో తమ పిల్లలకు చెప్పుకోలేక ఇండ్లలో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
ఇక మద్యం విషయానికి వస్తే… ఇప్పుడు మద్యం తాగడం ఓ ఫ్యాషన్ గా మారింది. చిన్నపాటి ఫంక్షన్ చేసినా దావత్ ఎంతో అవసరం… మద్యం సీసాలపై వున్న రేట్ల కన్న డబుల్, త్రిబుల్ రేట్లకు అధికంగా బెల్ట్ షాపులలో ఎవరికి తెలవకుండా విక్రయిస్తున్నారు. బెల్ట్ షాపులకు ఇంత స్టాక్ ఎక్కడ నుంచి వచ్చింది అనేది ఎవరికి అర్దంకావడం లేదు. బెల్ట్ షాపుల వెనుక మద్యం వ్యాపారులు ఎవరైనా వున్నారా లేక ఇతర రాష్టాల నుంచి రహస్యంగా తరలించి డంప్ చేశారా అన్న అనుమానం వస్తుంది. దీంతో కోట్ల రూపాయల్లో చీకటి దందా నడుస్తోంది.
కరోనా ను నిరోధించే శక్తి తమ బ్రాండ్ కు ఉందని ఓ కంపెనీ మద్యం సీసా పై ముద్రించడంతో, జనాలు ఎవరైనా కొనుగోలు చేయడానికి వెనుకంజ వేయటం లేదు. . ఆల్కహల్ పర్సేంటేజ్ వున్న వాటిని వాడుతే కరోనా ధరిచేరదని చెప్పడంతో.. మద్యం సీసాపై ఇలాంటి ముద్రలు వేయడంతో మద్యం ప్రియులు మద్యం తాగేందుకు తహతహలాడుతున్నారు….