కరోనా వైరస్ ఎఫెక్ట్ తో తిరుమల శ్రీ వారి లడ్డూలు మిగిలిపోయాయి. దాదాపు 2లక్షల 40 వేల లడ్డూలు మిగిలిపోయాయి.మిగిలిన లడ్డూలను భద్ర పరచడానికి టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో కొన్ని లడ్డూలను టీటీడీ ఉద్యోగులకు పంచి పెట్టాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో ఉద్యోగికి 10 లడ్డూల చొప్పున ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో అప్పటికే తయారుచేసి ఉన్న తిరుమల శ్రీవారి లడ్డూలు మిగిలిపోయాయి.భక్తులకు దర్శనం కల్పించకపోయినా స్వామి వారి నిత్య సేవలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఏకాంతంగా స్వామి వారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.