ప్రపంచ దేశాలతో పాటు ఇండియాను కూడా కరోనా వైరస్ గడగడ లాడిస్తుండటంతో… తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ కళ తప్పింది. ఆదివారం నుండి జనం పెద్దగా బయటకు రాకపోవడంతో పాటు మార్కెట్లు బోసిపోతుండటం, సొంత ఊర్లకు వెళ్ళాలని అనుకునే వారికి లాక్ డౌన్ ప్రభావం పడటంతో ఉగాది పండుగ సందడి గతంలో ఉన్నంత కనపడటం లేదు.
మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య ఇండియాలో 560 కి చేరుకుంది. తెలంగాణలో క్రమంగా కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 39కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరణాలు 11కు చేరాయి.
మరో వైపు ఇప్పటికే అన్ని రాష్ట్రాలు మార్చగి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ అంటూ ప్రకటన చేసింది. అయితే, అంతర్జాతీయ విమానాలు, రైళ్లు, బస్సులతో పాటు అన్ని మూసివేయటంతో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.