కరోనా వైరస్ కు మూకుతాడు వేసేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతోపాటు అనుమానితుల సంఖ్య కుడా ఎక్కువ అవుతుండటంతో….హైదరబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు అందుబాటులో ఉండవని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే గాంధీ ఆసుపత్రుల్లో రెగ్యులర్ చెకప్ లతోపాటు, అత్యవసరం కాని ఆపరేషన్లను నిలివేశారు. కరోనా వ్యాప్తి మరింత పుంజుకుంటుండంతో తాజాగా నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తునట్లు మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే పారామెడికల్ సిబ్బందిని కుడా వినియోగించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని..ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాల అమలుకు సహకరించాలని కోరారు మంత్రి ఈటెల. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ప్రజలెవ్వరు బయటకు రావొద్దని.. వచ్చిన గుంపులు, గుంపులుగా ఉండవద్దని కోరారు.