మహారాష్ట్రపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. దేశంలో ఇటీవల భారీగా పెరుగుతున్న కేసుల్లో సగానికంటే ఎక్కువ ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నుంచి మహారాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతరూపం దాల్చింది. వందల్లో ఉన్న కేసులు కాస్తా.. మళ్లీ వేలల్లోకి ఎగబాకాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 10,216 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా కారణంగా తాజాగా మహారాష్ట్రంలో 53 మంది మరణించారు.
మహారాష్ట్రలో మొత్తం కరోనా బారినపడినవారుః 21,98,399
కోలుకున్నవారుః20,55,951
మరణించినవారుః 52,393
యాక్టివ్ కేసులుః 88,838
దేశంలో కొత్తగా అత్యధికంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర తర్వాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక ఉన్నాయి. ఈ ఆరు రాష్ట్రాల్లోనే 85 శాతానికిపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.