ఆ యువకుడి పేరు అఖిల్ ఎన్నంశెట్టి. వయసు 24 సంవత్సరాలు. వృత్తిరీత్యా న్యాయవాది. ఎడిన్‌బరో యూనివర్శిటీలో ఉన్నత విద్య చదువుతున్నారు. బ్రిటన్ నుంచి వచ్చేటపుడు తనకు కరోనావైరస్ సోకలేదని ఊరంతా తిరగలేదు. అలాగని వైరస్ సోకిందేమోనని బెదిరిపోలేదు. బాధ్యతగా నడుచుకున్నారు…జాగ్రత్తలు తీసుకున్నారు. తనకు తానుగా వెళ్లి పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ అని ఫలితం వచ్చాక భయపడలేదు. అయినవాళ్లకి దూరంగా ఒంటరిగా ఉండాల్సి వస్తోందని కుంగిపోలేదు. భయం అవసరం లేదని సమాజానికి భరోసా ఇస్తున్నారు అఖిల్.
అఖిల్ కు వైరస్ ఉందన్న విషయం తెలియదు. ఒకవేళ ఉంటే ఎవరికీ రాకూడదని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాడు. ఉందన్న విషయం తెలిశాక.. అతను తీసుకున్న జాగ్రత్తలను అందరూ అభినందించారు. బ్రిటన్ లో పరిస్థితుల వల్ల అఖిల్ అతికష్టం మీద బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చాడు, స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకున్నారు.
అఖిల్ ది ఆంధ్రప్రదేశ్ లోని చిన్న గ్రామం , ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్ళాడు, అందరిలాగే బ్రిటన్ లో పరిస్థితుల వల్ల సొంత దేశానికి పయనం అయ్యాడు. లాక్‌డౌన్ సమయంలో బ్రిటన్‌లో ఉండటం చాలా కష్టమవుతుందని భారతీయ విద్యార్థులు భావించారు. అఖిల్ కూడా ఇండియా కు టికెట్ తీసుకొని బయల్దేరాడు బ్రిటన్ లో కరోనా తీవ్రంగా ఉండడం తో తనకు కూడా ఉండే ప్రమాదం ఉంది అని భావించి ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పూర్తిగా తీసుకున్నాడు…
‘‘మార్చి 17న లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరి ముంబయి మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడు. అఖిల్ కు బయలుదేరే సమయానికి వైరస్ సోకిందనే విషయం ఏ మాత్రం తెలియదు కానీ ప్రయాణం లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సాధ్యమైనంత వరకు ఇతరులకు దూరంగా ఉంటూ, వ్యక్తులను, వస్తువులను, ప్రదేశాలను తాకకుండా ఉంటు హైదరాబాద్ చేరుకున్నాడు .తాను అన్ని మెడికల్ టెస్ట్ లు చేయించుకొని ఇంటికి వస్తా అని హైదరాబాద్ వచ్చేముందే అఖిల్ తన తల్లిదండ్రులకు, స్నేహితులకు స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తుంది. అదే విధంగా హైదరాబాద్ లో దిగిన వెంటనే అతనికి టెస్ట్ లు చేసి నీకు నెగిటివ్ ఉంది ఇంటికి వెళ్లిపోవచ్చు అని డాక్టర్లు చెప్పారు. అక్కడినుంచి హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్ కు వెళ్లిన అఖిల్ అక్కడ కూడా జాగ్రత్తగా నే ఉన్నారు. మరుసటి రోజు గొంతులో నొప్పి రావడం తో స్వయంగా గాంధీ హాస్పిటల్ కు వెళ్లి టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అనితేలింది.అదే తెలంగాణ లో 16 వ కరోనా కేసు. విదేశాల నుంచి వచ్చే వాళ్ళు అందరూ అఖిల్ ల ఆలోచించుకొని ఉంటే కరోనా మహమ్మారి ని కొంతైనా నిరోధించేవాళ్ళం. అఖిల్ కూడా అందరిలా పరీక్ష చేయించుకోకుండా ఇంటికి వెళ్లుంటే, అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఇరుగుపొరుగుకూ నుంచి వైరస్ సోకేది కదా!’’బ్రిటన్ నుంచి అతను బయల్దేరినప్పటినుంచి గాంధీ హాస్పిటల్ కు వెళ్ళేదాక అఖిల్ తీసుకున్న నిర్ణయాలు చాలా మందిని కరోనా నుంచి కాపాడాయి.