దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వైరస్ ధాటికి తట్టుకోలేక బాధితులు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో రోజు రోజుకి రికార్డ్ స్థాయిలో మరణాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ఏకంగా 1007 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ మరణాల్లో ఇదే అత్యధికం. దీంతో ఈ మహమ్మారి కారణంగా దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 44 వేల 386కు పెరిగింది.
మరోవైపు దేశంలో వరుసగా నాలుగో రోజూ 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62 వేల 64 మంది కరోనా బారినపడ్డారు. ఇందులో ఇప్పటివరకు 15 లక్షల 35 వేల 744 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6 లక్షల 34 వేల 945 మంది చికిత్స పొందుతున్నారు. రికవరీ రేటుతో పాటు మరణాల రేటు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
కాగా నిన్న 4 లక్షల 77 వేల 23 మందికి కరోనా టెస్టులు చేయగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల 45 లక్షల 83 వేల 558 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది.