రోజురోజు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతూనే ఉంది. తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 3,320 కేసులు నమోదు కాగా 95 మంది మృతి చెందారు. దీనితో మొత్తం కేసుల సంఖ్య 59,662 చేరుకుంది. మృతుల సంఖ్య మొత్తం 1,981 చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా నుంచి 17,847 మంది కోలుకోగా, ఆసుపత్రుల్లో 39,834 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.