సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక విమర్శలే కాదు ఫన్నీ మీమ్స్ కు కొదవే లేదు. ఒక్కోసారి ఒక్క పోస్ట్ కడుపుబ్బా నవ్విస్తుంది. తాజాగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి పై వచ్చిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కరోనా వారి పెండ్లి పిలుపు… మా అదృశ్య పుత్రుడు వరుడు చిరంజీవి కరోనాకు చైనా వాస్తవ్యులు వధువు చి.ల.సౌ మిగిలిన దేశాల ప్రజలు లకు వివాహ మహోత్సవం జరుపుటకు కాలము నిర్ణయించబడినది. కళ్యాణ వేదిక క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ వార్డులో గల హాస్పిటల్స్ నందు జరుగును. ఆహ్వానించువారు చైనా దేశ ప్రజలు అంటూ ఓ పోస్టు వైరల్ గా మారింది. ఆకరిలో విన్నపము అంటూ… మూతికి గుడ్డ కట్టి, శానిటైజర్ చేతబట్టి, కళ్యాణ వేదిక నందు సామాజిక దూరం పాటిస్తూ తమ చేతులతో కరోనాను ఆశీర్వదించగలరు అంటూ ప్రస్తావించారు.
కరోనా వారి పెండ్లి పిలుపు శుభలేఖ ఇదే-