ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తున్న కరోనా కొన్ని ప్రత్యేక లక్షణాల్ని ప్రదర్శిస్తోందంటున్నారు వైద్యులు.చిన్న పిల్లలపై కరోనా కరుణ చూపుతోందంటున్నారు డాక్టర్లు.చిన్న పిల్లలకు తరచుగా జలుబు రావడం కారణంగా వారిలో రెసిస్టెన్స్ పెరిగిందంటున్నారు వైద్యులు.
ఇక మహిళల విషయంలో కరోనా దయ చూపుతోందంటున్నారు వైద్యులు. మహిళలకు ఈ వైరస్ సోకినప్పటికి త్వరలోనే వారు కోలుకుంటున్నారు.అయితే నలభై ఏళ్లు దాటిన మగవారి విషయంలో కరోనా నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది.
మరోవైపు B బ్లడ్ గ్రూప్ వారిని కూడా కరోనా చూసీ చూడనట్టు వదిలేస్తుందని వైద్యుల పరిశీలనలో తేలింది.ఒక్కో వర్గం ప్రజల పట్ల ఒక్కో తీరుగా వ్యవహరిస్తున్న కరోనా ప్రకృతిలో పుట్టిందా? లేక శతృ సంహారానికి లాబోరేటరీలో వం డారా? అన్నది తేలాల్సి ఉంది.