తెలంగాణ సచివాలయంలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ కు కరోనా నెగిటివ్ రావడంతో సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.తెలంగాణ సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ విభాగంలో పని చేస్తున్న ఓ సెక్షన్ ఆఫీసర్ కు కరోనా సోకిందనే వార్తలు మంగళవారం కలకలం రేపాయి. ఇటీవలే ఆ ఉద్యోగి ఢిల్లీ ప్రార్ధనలకు వెళ్లొచ్చారు. దీంతో అతనికి కరోనా టెస్టులు చేయగా… కరోనా నెగిటివ్ గా తేలింది. దీంతో సచివాలయం ఉద్యోగులు ముప్పు తప్పిందని భావిస్తున్నారు. ఉద్యోగికి కరోనా పాజిటివ్ అనే వార్తలతో సచివాలయం (బిఆర్కే భవన్) మొత్తం సిబ్బందితో శానిటేషన్ చేయించారు.