దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో చాలా మంది సినీ స్టార్స్ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, కొడుకు అకీరా కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదే విషయాన్నీ పది రోజుల క్రితం రేణుదేశాయ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు రేణు దేశాయ్. నెగిటివ్ రావటంతో ఇంటి నుంచి మొదటిసారి బయటకు వచ్చారు.
కరోనా తరువాత ఇలా డిన్నర్ కోసం బయటకు వెళ్లడం చాలా కొత్తగా అనిపిస్తోందనిచెప్పుకొచ్చింది రేణుదేశాయ్. ఇక రేణుదేశాయ్ రవితేజ నటించబోతున్న టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ తో రీఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియా కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. మరి చూడాలి రేణుదేశాయ్ నటిస్తుందా లేదా అనేది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతుంది.