దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటి సంఖ్యతో పోలిస్తే పైకి ఎగబాకాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 97.35 లక్షలకు పెరిగింది. అటు కరోనా కారణంగా నిన్న 402 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు దేశంలో ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య లక్షా 41 వేల 360కు పెరిగాయి.
కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 9.15 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో 3.78 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 10.22 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. దీంతో మొత్తం 14.98 కోట్ల మందికి పరీక్షలు చేసినట్టు వెల్లడించింది.