వుహాన్…ఇప్పుడ ప్రపంచమంతటికీ తెలిసిన పేరు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ తో వందలాది మందిని బలితీసుకున్న చైనాలోని ఓ మృత్యు నగరం. ఆ నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిర్మానుష్యమైన రోడ్లు…మూత పడిన దుకాణాలు..శ్మశాన నిశబ్ధం. ఆ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయమని చెప్పాయి. చిన్న వ్యాపార సంస్థలు మూతపడ్డాయి…కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి. దీంతో ఎకానమీ తగ్గుముఖం పట్టింది.
ఇలాంటి పరిస్థితుల్లో వుహాన్ లోని ఒక కంపెనీ మాత్రం సాధారణ పని గంటల కంటే 24* 7 పని చేస్తోంది. దాదాపు 2,600 మంది ఉద్యోగులు 24 గంటలు పని చేస్తున్నారు. వారికి ఊహించని ఇంక్రిమెంట్స్ అందాయి. అదే వుహాన్ గైడ్ ఇన్ ఫ్రారెండ్ కంపెనీ. శరీరంలోని హై టెంపరేచర్ ను చూపించే థర్మల్ ఇమేజింగ్ ఎక్విప్ మెంట్స్ ను తయారు చేసే ఈ కంపెనీ ఇప్పుడు లాభాల్లో దూసుకుపోతుంది. అతి తక్కువ కాలంలో అత్యధికంగా 300 శాతం లాభాలు సాధించింది. దాదాపు ఈ కంపెనీ సంవత్సరానికి 100 మెషిన్లను తయారు చేస్తుండగా….గత రెండు వారాల్లోనే 230 మిషన్లను తయారు చేసింది.
చైనా మిలిటరీ ఈ థర్మల్ ఇమేజింగ్ ఎక్విప్ మెంట్ కంపెనీకి ప్రధాన కస్టమర్. డిమాండ్ కు తగ్గ సప్లయ్ లేకపోవడంతో చైనా మిలిటరీ వాటి కోసం ఎదురు చూస్తుంది. ప్రొడక్షన్ పెంచినప్పటికీ కావాల్సినన్ని సప్లయ్ చేయలేకపోతుంది. కంపెనీ మార్కెట్ విలువ ఇప్పుడు 5.16 బిలియన్ డాలర్లకు చేరింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ దేశంలో నాలుగో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీగా గుర్తింపు పొందింది. రెండు వారాల క్రితం ఒక కస్టమర్ 230 మిషన్లు కావాలని ఆర్డర్ ఇవ్వడంతో ఉద్యోగులను పెంచి ఉత్పత్తిని పెంచామని కంపెనీ ఫౌండర్ గ్యారీ స్ట్రాహన్ తెలిపారు. వేలాది మంది కస్టమర్ల నుంచి ఆర్డర్లు వస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు చైనాలోని కోటీశ్వరుల్లో ఒకరైన గ్యారీ చైనీస్ న్యూ ఇయర్ కు కూడా సెలవు తీసుకోలేదన్నారు.” వైరస్ మా ఉత్పత్తని ఆపలేదు…మమ్మల్ని మరింత బిజీగా చేసింది” అన్నారు గ్యారీ.