దేశంలో మరో కరోనా పేషెంట్ చనిపోయాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో 57 సంవత్సరాల కరోనా పేషెంట్ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. మృతుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఇతను డమ్ డమ్ ఎయిర్ పోర్ట్ సమీప ప్రాంతానికి చెందిన వాడు. జ్వరం, దగ్గుతో మార్చి 16న హాస్పిటల్లో చేరాడు. మార్చి 19 వరకు లక్షణాలు తీవ్రమయ్యాయి. శ్వాస కష్టమైంది. దీంతో అతన్ని వెంటిలేటర్ పై ఉంచారు. అతని శాంపిల్స్ ను టెస్ట్ కు పంపగా కరోనా పాజిటివ్ గా తేలింది. సోమవారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. ఇతని మృతితో వైరస్ గొలుసుకట్టుగా వ్యాపించడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ మూడో స్టేజ్ కు చేరిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో నమోదైన కేసులో ఇతను ఏడో పేషెంట్. మొట్ట మొదట యూకే నుంచి వచ్చిన యువకుడికి వైరస్ సోకింది.