నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య ఇస్తున్న కరోనా మందుకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. జిల్లాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఏకంగా కిలోమీటర్ మేర క్యూలైన్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఆనందయ్య మందుకోసం కరోనా రోగులు కూడా వెళ్లడం కలవరపరుస్తోంది.
నెల్లూరు GGHలో కరోనాకు చికిత్స పొందుతున్న రోగులంతా ఉన్నట్టుండి పరారయ్యారు. ఆనందయ్య ఆయుర్వేద మందు కరోనాను నయం చేస్తోందని తెలియడంతో అందరికందరు కృష్ణపట్నం వెళ్లారు. దీంతో హాస్పిటల్ మొత్తం ఖాళీ అయ్యింది. అయితే ఇప్పటికే వారికి కరోనా సోకి ఉండటంతో.. అధికారులు ఆందోళన చెందుతున్నారు.