మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కరోనా కేసుల సంఖ్య ఇండియాలో భారీగా పెరుగుతుంది. ఇప్పటికే అక్కడికి వెళ్లిన వారిని ట్రేస్ చేస్తూ, వారితో సన్నిహితంగా ఉన్నవారికి పరీక్షలు చేయించే ఏర్పాట్లలో ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి. ఎక్కువ మంది ఒకేసారి వెళ్లటం, ఇరుకైన ప్రాంతంలో అంతా ఉండటంతోనే మర్కజ్ వెళ్లిన వారిలో కరోనా వైరస్ సోకటానికి కారణం అయ్యింది.
అయితే… మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారిని దొరికిన వారిని దొరికనట్లు తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రికి తరలిస్తుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో పలువురు చికిత్స పొందుతున్నారు.
కానీ వారంతా ఇప్పుడు ఓకే చోటుకు చేరి ప్రార్థనలు చేసుకోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ డిస్టెన్సింగ్ ద్వారానే కరోనా నయం అవుతుందని ఎంతా చెప్పినా, మీరంతా గుంపులుగా ఉండటం వల్లే మీకు వైరస్ సోకిందని ఎంత చెప్పినా వినకుండా… మత ప్రార్థనలు చేయటంపై జనం ఫైర్ అవుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది నో చెప్పినందుకు వారిపై కూడా దూషణలకు దిగుతున్నారని తెలిసి… దేవుడు ఒంటరిగా ప్రార్థనలు చేసుకోవద్దు అంటాడా…? గుంపులు గుంపులుగా ఉంటే ప్రమాదం అని తెలిసినా ఎందుకు ఇంత మొండితనం అని ప్రశ్నిస్తున్నారు.
గుంపులుగా మత ప్రార్థనలు చేస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్లో వైరల్ అవుతున్నాయి.