
భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. వేల ప్రాణాలు గాలిలో కపిసిపోతున్నాయి. తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23లక్షల మార్కు ను దాటిపోయింది. గడిచిన 24గంటల్లో 60,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు 834 మంది కరోనా మహమ్మారి బారిన పడి మరణించారు. దీనితో మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,29,638 కు చేరింది. మొత్తం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 6,43,948 మంది కి చికిత్స కొనసాగుతుందగా 16,39,599 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 46,091 చేరుకుంది.