దేశంలో కరోనా కేసులు మరికొంత కొద్దిగా తగ్గాయి. నిన్న 27 వేల కేసులు నమోదు కాగా.., ఇవాళ 22 వేల కేసులు వెలుగు చూశాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 99 లక్షలు దాటింది. మరో మూడు, నాలుగు రోజుల్లో ఈ సంఖ్య కోటి మార్క్ దాటనుంది. కాగా దేశంలో ఇప్పటికే 94.22 లక్షల మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మరో 3.52 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు కరోనా కారణంగా నిన్న 354 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాలు 1,43,709కు పెరిగాయి. నిన్న 9.93 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఐసీఎమ్మార్ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటివరకూ 15.55 కోట్ల టెస్టులు చేసినట్లు వివరించింది.