తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి .ఇదివరకు రోజుకు రెండు,మూడు పాజిటివ్ కేసులు నిర్దారణ అవ్వగా..శుక్రవారం ఏకంగా పది కేసులు పాజిటివ్ గా నిర్దారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా వ్యాప్తిపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం వరకు తెలంగాణలో 49 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. శుక్రవారం పది కరోనా కేసులు పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరుకుంది. ఈ విషయాన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
అయితే 20 వేలమంది క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారని వారికి పరిక్షలు నిర్వహించారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 11000 ఐసోలేషన్ బెడ్స్… 1400 క్రిటికల్ బెడ్స్ రెడీగా ఉన్నాయని.. 60 వేల మంది కరోనా పేషెంట్లు ఉన్నా హాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా ప్రభుత్వం సిద్దంగా ఉందని భరోసా ఇచ్చారు.