రాజమండ్రి సెంట్రల్ జైలు లో కరోనా కలకలం రేగింది. తాజాగా 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొత్తం సెంట్రల్ జైలు లో 1670 ఖైదీలు, 200 మంది సిబ్బంది ఉండగా జైలు లో ఉన్న 28 మంది ఖైదీలకు, 24 మంది జైలు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొత్తగా 10 మంది ఖైదీ లకు కరోనా పాజిటివ్ రాగా ఇంకా 900 మంది పరీక్షల రిపోర్ట్ రావాల్సి ఉంది. కరోనా పాజిటివ్ సోకిన ఖైదు లకు ప్రస్తుతం కోవిద్ ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుంది. కరోనా సోకిన సిబ్బందిలో కొందరు ఆసుపత్రుల్లో మరికొందరు హోమ్ ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైల్ లో మూలాఖత్ ను అధికారులు నిలిపివేశారు.