దేశంలో కరోనా వైరస్ విజృంభణ క్రమంగా తగ్గుతోంది. రెండు నెలల క్రితం రోజుకు లక్షకు సమీపంలో నమోదైన కేసులు… అందులో మూడో వంతుకు తగ్గాయి. ప్రస్తుతం సగటున రోజుకు 40 వేలలోపే కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇవాళ్టి వరకు దేశంలో మొత్తం కరోనా కేసులు 95 లక్షలు దాటాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ నెలాఖరు కల్లా దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి మార్క్ చేరుకునే అవకాశాలున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 35 వేల 551 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 526 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 95.34 లక్షలకు చేరింది. ఇందులో ఇప్పటికే 89.73 లక్షల మంది కోలుకోగా.. ప్రస్తుతం 4.23 లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా కారణంగా లక్షా 38 వేల 648 మంది మరణించారు.
దేశవ్యాప్తంగా నిన్నటివరకు 14. 35 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. కాగా నిన్న 11.11లక్షల టెస్టులు చేసినట్టు వివరించింది.