దేశంలో మరోసారి కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. దాదాపు రెండు వారాలుగా 40 వేలకుపైగా నమోదవుతున్న కేసులు.. ఇంకొంచెం దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 772 మంది కరోనా బారినపడ్డారు. వీటితో కలిపి దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 94 లక్షలు దాటాయి. కరోనా కారణంగా మరో 443 మంది మరణించారు.
దేశంలో ప్రస్తుతం 94.31 లక్షల కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే 88.47 లక్షల మంది కోలుకోగా.. 4.46 లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షా 37 వేల 139 మంది కరోనా మహమ్మారితో మరణించారు.
దేశంలో నిన్నటివరకు 14 కోట్ల మందికి మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 8,76,173 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.