తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 19,929 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. గతంలో 40 వేల టెస్టులు చేస్తే.. ఈ స్థాయిలో కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్ప్పుడు 20 వేల టెస్టులకే 100కు పైగా పాజిటివ్ కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు తాజా కేసులలతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 3 లక్షల మార్క్ దాటాయి. ఇప్పటి వరకు 3 3,00,011 కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న మరొకరు మరణించారు. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1642కి పెరిగింది.
కరోనా బారి నుంచి తాజాగా 189 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జీలు 2,96,562కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 89,84,552 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.