హైదరాబాద్ వాసులను ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అధికారికంగా కేసు బయటపడకపోయినా.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 11 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ అయింది.
ఇప్పటివరకు విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణికుల్లో మొత్తం 12 మంది వైరస్ బారిన పడ్డారు. వారందరినీ టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
యూకే నుంచి 9 మంది, సింగపూర్ నుంచి ఒకరు, కెనడా నుంచి ఒకరు, అమెరికా నుంచి వచ్చిన ఒకరికి వైరస్ సోకింది. వీరందరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు.