ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల్ పట్టణనికి చెందిన ఓ వ్యక్తి నిజామెుద్దిన్ వెళ్లి వచ్చాడు. అనుమానం తో పరీక్షలకు పంపించగా పాజిటివ్ గా అధికారులు గుర్తించారు. ఆ తరువాత గాంధీ ఆసుపత్రికి తరలించగా సోమవారం ఉదయం ఆసుపత్రి నుంచి పరారీ అయ్యారు.
ప్రస్తుతం సదరు వ్యక్తిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు, అధికారులు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 334 పాజిటివ్ కేసులు నందుకు అయ్యాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలంతా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.