దేశంలో కరోనా మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సామాన్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే ముఖ్యంగా సినీ స్టార్స్ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
కాగా తాజాగా యాక్షన్ కింగ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సలహాలు సూచనలు తీసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొద్ది రోజుల నుండి నన్ను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. నేను బాగానే ఉన్నాను. అందరూ జాగ్రత్త పడండి. మాస్క్ తప్పని సరిగా ధరించండి అంటూ చెప్తూనే రామ భక్త హనుమాన్ కి జై అంటూ చెప్పుకొచ్చారు అర్జున్.