తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ధనుష్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఓ పని మీద హైదరాబాద్ వచ్చారు ఐశ్వర్య. ధనుష్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ ఒకరినొకరు కలుసుకోలేదు.
మొన్న ఓ పార్టీ కి ఇద్దరూ హాజరయ్యారు. అయినప్పటికీ మాట్లాడుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ధనుష్ పేరును తీయలేదు ఐశ్వర్య.
ఇదిలా ఉండగా ఐశ్వర్య రీసెంట్ గా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గతంలోనూ ఐశ్వర్య కు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మరోసారి కరోనా తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. జీవితం అనేది కరోనా కి ముందు కరోనా కి తర్వాత అన్నట్టుగా అయిపోయింది.
జ్వరంతో ఆస్పత్రిలో చేరా అంటూ ఐశ్వర్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఇది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని అంటూ ట్వీట్ లు చేస్తున్నారు.