కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ నిత్యం వంద,రెండు వందల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కాగా కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయిన షూటింగులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలు దర్శకులు షూటింగ్ లకు హాజరవుతున్నారు. కాగా ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ రాగా.. తాజాగా క్రేజీ డైరెక్టర్ క్రిష్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి జనవరి 4 నుంచి షూటింగ్ కు ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది అంతా టెస్ట్ లు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో షూటింగ్ క్యాన్సిల్ చేశారు.