కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలోనే చాలా మందిని ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఈ కరోనా ఎఫెక్ట్ పడింది. చాలా మంది సినీ స్టార్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. తాజాగా హీరోయిన్ డింపుల్ హయాతి కి పాజిటివ్ నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా వైరస్ బారిన పడ్డానని… పూర్తిగా టీకాలు వేసుకున్నప్పటికి తేలికపాటి లక్షణాలతో పాజిటివ్ వచ్చిందని అన్నారు.
అలాగే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్ లు ధరించాలని, చేతులను శుభ్రం చేసుకోవాలని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే డింపుల్ హయాతి రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడిలో నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రం రిలీజ్ అవ్వడం కష్టమే అనిపిస్తోంది.