హీరోయిన్ శృతిహాసన్ గురించి కొత్తగా సినీ అభిమానులకు పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కరోనా తో ఇంటికే పరిమితం అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని స్వయంగా చెప్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది శృతిహాసన్.
దీనితో అభిమానులు, సినీ స్టార్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరికీ హాయ్! చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
నేను కోలుకుంటున్నాను, అతి త్వరలో తిరిగి వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సలార్, ఎన్.బి.కె 107 సినిమాల్లో నటిస్తుంది.
అలాగే ఈ అమ్మడు నటించిన వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.
Advertisements