ఇటీవల కాలంలో చాలా మంది సినీ స్టార్స్ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. టాలీవుడ్ నుంచి అయితే మహేష్ బాబు, థమన్, మంచు మనోజ్, మంచు లక్ష్మి చిరంజీవి ఇలా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. అలాగే బాలీవుడ్ లో కూడా చాలా మంది స్టార్స్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
తాజాగా రాజ్యసభ సభ్యురాలు, నటి జయబచ్చన్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నారు.
దీనితో ఆమె నటిస్తున్న రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్, అలియా భట్ ప్రీతి జింటా, ధర్మేంద్ర, షబానా అజ్మీ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలే షబానా అజ్మీ కూడా కరోనా బారిన పడ్డారు.
మరోవైపు గత ఏడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు కరోనా బారిన పడ్డారు.