దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమ పై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా మంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. గతంలో ఏక్తా కపూర్, విశాల్ దద్లానీ, ఖుషీ కపూర్ వంటి ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
ఇప్పుడు గొప్ప గాయని అయిన లతా మంగేష్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయితే లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పూజలు చేస్తున్నారు.