దేశం లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారికి బలైపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ స్టార్స్ కు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కి కరోనా నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తేలికపాటి జ్వరంతో పాటు బాగానే ఉన్నట్లు తెలిపారు.
వైద్యుల సూచనల మేరకు ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.