మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.’’ స్వల్ప లక్షణాలతో కరోనా ఎటాక్ చేసింది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది.హోం క్వారంటైన్ లోఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోండి. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను’’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
గతంలో కూడా చిరంజీవికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ.. తప్పుడు కరోనా కిట తో పరీక్షించుకోవడం వల్ల పాజిటివ్ గా నిర్థారణ అయిందని.. కానీ..తను ఆరోగ్యంగా ఉన్నానని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం మెగాస్టార్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.
ఆయన నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.అటు గాడ్ ఫాదర్,భోళా శంకర్, బాబీ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు. చిరంజీకి కరోనా రావడంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ ఆగిపోనుంది.