ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఈ మహమ్మారి బారిన సామాన్య ప్రజలే కాకుండా ప్రజాప్రతినిధులు అధికారులు సైతం పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులు ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనకు హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు శాసన మండలి చైర్మన్ షరీఫ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల అంబటి రాంబాబు, విజయసాయిరెడ్డి అచ్చెన్నాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే.