కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇదే విషయాన్ని స్వయంగా ఆయన ప్రకటించారు. నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. అయినప్పటికీ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటున్నాను అని తెలిపారు.
అలాగే ఇటీవల కాలంలో తనని కలిసిన వారందరూ కూడా టెస్ట్ లు చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని సేఫ్ గా ఉండాలని పేర్కొన్నారు.