హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అయితే ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ వేదిక ఈ మేరకు ఓ పోస్ట్ పెట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నపటికీ….అన్ని లక్షణాలతో నాకు కరోనా పాజిటివ్ అని తేలింది.
ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సూచనల మేరకు మందులు వాడుతున్నాను. దయచేసి ఇటీవల కాలంలో నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
నేను కూడా చెప్తున్నాను దయచేసి అందరు మాస్కులు ధరించండి. అవసరమైతే తప్ప బయటికి రాకండి అంటూ పేర్కొన్నారు.
ఇక ప్రియాంక జవాల్కర్ సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆ తరువాత తిమ్మరుసు, ఎస్ ఆర్ కళ్యాణ మండపం చిత్రాల్లో కూడా నటించింది.