సుప్రీంకోర్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. వరుసగా కోర్టులో సిబ్బంది, జడ్జీలు కరోనా బారినపడటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా 10 మంది జడ్జీలకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.
థర్డ్ వేవ్ లో అత్యున్నత న్యాయస్థానంలో కరోనా సుడిగాలి వేగంతో వ్యాపించింది. దీంతో.. ఆరోగ్యశాఖ కోర్టులో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీరోజు పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో ప్రతి 10 మందిలో ముగ్గురి కరోనా ఉన్నట్టు తేలింది. సుప్రీంకోర్టులో కరోనా పాజిటివిటీ రేటు 30 శాతానికి పెరిగిందని వైద్యశాఖ చెప్పింది.
మొత్తం 32 మంది జడ్జీలకు గాను..10 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వరుసగా జడ్జీలకు మహమ్మారి సోకడంతో అత్యవసర కేసుల విచారణకు బెంచ్ ల ఏర్పాటు చేయడం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు కత్తిమీద సాములా మారింది. కోర్టులో 24 గంటలపాటు వైద్యసేవలు అందిస్తున్నారు.
ప్రతిరోజు 200 మంది వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తూ వస్తున్నారు. కోర్టులో మొత్తం 1500మంది ఉద్యోగులుంటే వారిలో 400 మందికి వైరస్ సోకింది. వారితో పాటు కోర్టు ప్రాథమిక వైద్యకేంద్రంలో పనిచేస్తున్న ముగ్గురు వైద్యులకు కూడా పాజిటివ్ వచ్చింది. కరోనా ఉధృతి పెరగటంతో భారీగా పెరగడంతో కేసుల విచారణ వర్చువల్ గా జరుగుతుంది.