పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు తరుణ్ భాస్కర్. దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అయితే తాజాగా కరోనా బారిన పడ్డాడు తరుణ్ భాస్కర్.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఇంస్టాగ్రామ్ వేదిక తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెబుతూనే కరోనా సీరియస్ గురించి చెప్పారు. ఇకపోతే ఇటీవల కాలంలో చాలా మంది సినీ స్టార్స్ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, కీర్తి సురేష్, త్రిష, విష్ణు విశాల్, మమ్ముట్టి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇలా చాలామంది ఈ మహమ్మారి బారిన పడ్డారు.
కాగా ఇందులో మహేష్ బాబు, కీర్తి సురేష్, తమన్, విష్ణు విశాల్ పూర్తిగా కోలుకున్నారు.