దేశంలో కరోనా వైరస్ ఇంకా దోబూచులాడుతోంది. వారం రోజులుగా కేసులు.. ఓసారి తగ్గుతూ, మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,052 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్‌తో పోరాడుతూ నిన్న మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 13,965 మంది వైరస్‌ను జయించారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,07,46,183కు చేరింది. ఇందులో ఇప్పటికే 1,04,23,125 మంది కోలుకున్నారు. ఇక వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1,54,274కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,68,784 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా నిన్న 7,50,964 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటివరకు 19,65,88,372 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది.