దేశంలో కరోనా వైరస్ విజృంభణ తగ్గడంతో పాటు.. కోలుకున్నవారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉండటం ఎంతో ఊరటనిస్తోంది. దేశంలో ఇవాళ్టి వరకు కోటికిపైగా కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో మొత్తం ఇప్పటివరకూ సుమారుగా కోటీ 4 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా.. ఇందులో కోటీ 16 వేల మంది కోలుకున్నారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,346 కరోనా కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి మొత్తం 1,03,95,278కు కేసుల సంఖ్య చేరింది. కరోనా కారణంగా నిన్న 222 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు లక్షా 50 వేల336కు పెరిగాయి. ప్రస్తుతం దేవంలో 2,28,083 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిన్న 9.37 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. కాగా ఇప్పటివరకు 17.84 కోట్ల శాంపిళ్లను పరీక్షించారు.